మరో చిత్రాన్ని ప్రమోట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

మరో చిత్రాన్ని ప్రమోట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

విల‌క్ష‌ణ న‌టుడు సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 24న‌ ప్రముఖ ఓటీటీ మాధ్య‌మం సోనీ లివ్‌లో ‘ఆకాశ‌వాణి’ డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా,  సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేసి... సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది, సినిమా ఇన్నోవేటివ్‌గా అనిపిస్తుంది, సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే... ‘‘మ‌నం స‌చ్చినా, బ‌తికినా.. తిన్నా, ప‌త్తున్నా ఎవ‌రి వ‌ల్ల‌, దేవుడి వ‌ల్ల‌.. దొర వ‌ల్ల అని’’ ముస‌లివాడు త‌న గూడెంలో మ‌రొక‌రి చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. అంద‌మైన కొండ‌లు, కోన‌లు న‌డుమ ఉండే గూడెంలో ప్ర‌జ‌లు దొర చేతిలో చిక్కి ఎలా భయ‌ప‌డుతున్నార‌నే స‌న్నివేశాల‌ను కూడా చూడొచ్చు.
‘‘గొర్రెలకు కొమ్ములు గూడానికి దమ్ములుండకూడదు’’ అని చెప్పే మరో వ్యక్తి చెప్పే డైలాగ్ ‘‘ఎన్ని ప్రాణాలు పోతున్నా దేవుడు కూడా మోకరాయల్లే కూకున్నాడు’’ అనే డైలాగ్‌తోపాటు వచ్చే సన్నివేశాలను చూస్తే గూడెంలోని ప్రజలు ఎలాంటి దుర్భరపరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంటుంది. గూడెం ప్రజలకు సాయం చేసే వ్యక్తిగా సముద్రఖని కనిపించనున్నాడని ట్రైలర్‌లో తెలుస్తుంది.

ఈ ‘అడవి గడప దాటాలంటే దేవుడికి కూడా నా దస్కత్ కావాలి వినిపిస్తుందా...’  అని తన చుట్టూ ఉన్న గూడెం జనాన్ని భయపెట్టే దొర పాత్రలో వినయ్ వర్మ కనిపిస్తున్నారు. అలాంటి అమాయకపు గూడెం ప్రజల చేతికి ఓ రేడియో దొరికితే ఎలా ఉంటుంది.. వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. గూడెం ప్రజల బతుకులకు విముక్తి దొరికిందా? అనే విష‌యాలు తెలియాలంటే ఆకాశ‌వాణి సినిమా చూడాల్సిందే. నేటి సిటీ వాతావ‌ర‌ణానికి దూరంగా ఎక్క‌డో అడ‌వుల్లో దూరంగా ఉండే గూడెంలో జ‌రిగే క‌థ అని అర్థ‌మ‌వుతుంది. ఓ డిఫ‌రెంట్ పాయింట్‌, బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైంది. సినిమా సెప్టెంబ‌ర్ 24న సోనీ లివ్‌లో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. ఇటీవల కాలంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హించారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు.  సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫర్‌గా వర్క్‌ చేశారు. . జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా వర్క్ చేశారు.

 

Tags :