ఎలాన్ మాస్క్ పై ప్రమీలా జయపాల్ విమర్శలు

ఎలాన్ మాస్క్ పై ప్రమీలా జయపాల్ విమర్శలు

టెస్లా మోటార్స్‌, స్పేస్‌-ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మాస్క్‌ అందరికన్నా ఎక్కువగా పన్నులు చెల్లిస్తానంటూ ప్రకటించడంపై అమెరికా శాసనకర్తలు విమర్శలు గుప్పించారు. తాను ఈ ఏడాదిలో 11 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.82వేల కోట్లు) పన్నులుగా చెల్లిస్తానని ఆయన ప్రకటించారు. దీనిపై ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ విమర్శించారు. ఆయన గొప్పలు చెప్పుకొంటున్నారంటూ మండిపడ్డారు. ఒక రోజులోనే 36 బిలియన్‌ డాలర్లు రూ.2.7 లక్షల కోట్లు) ఆర్జించారు. 11 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తానని చెప్పుకొంటున్నారు. కరోనా వచ్చిన తరువాత ఆయన సంపద 270 బిలియన్‌ డాలర్లు (రూ.20 లక్షల కోట్లు) మేర పెరిగింది. ధనవంతులు న్యాయబద్ధంగా పన్ను చెల్లించాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నారు.

 

Tags :