భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్‍ మరో మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. పురుషుల హైజంప్‍లో యువ అథ్లెట్‍ ప్రవీణ్‍ కుమార్‍ రజతం సాధించాడు. ఇక షూటింగ్‍లో అవని లేఖర ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‍ 3 పొజిషన్స్ ఎన్‍హెచ్‍ విభాగంలో అవని కాంస్య పతకం గెలిచింది. ఒక భారత క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ పోటీల్లో హర్దిందర్‍ సింగ్‍ కాంస్యం గెలిచి సత్తా చాటాడు. ఈ క్రమంలో పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్‍కు పతకం అందించిన తొలి క్రీడాకారుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య 13కు చేరింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

 

Tags :