పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం

పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ భారత్‍కు పసిడి పతకాల పంట పండుతున్నది. ఈ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‍లో భారత్‍ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‍ వన్‍ షట్లర్‍ ప్రమోద్‍ భగత్‍ ఫైనల్స్ లో ప్రపంచ నంబర్‍ టూ ర్యాంకర్‍, గ్రేట్‍ బ్రిటన్‍ షట్లర్‍ డేనియల్‍ బెథెల్‍ను 21-11-21-16 తేడాతో మట్టికరిపించాడు. ఈ స్వర్ణంతో భారత్‍ పతకాల సంఖ్య 16కు చేరగా, వీటిలో నాలుగు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‍కు బ్యాడ్మింటన్‍లో ఇదే తొలి పతకం కావడం విశేషం.

.

Tags :