ఘన టూరిజం అంబాసిడర్‌గా ప్రసాద్‌ గారపాటి

ఘన టూరిజం అంబాసిడర్‌గా ప్రసాద్‌ గారపాటి

ప్రముఖ ఎంట్రప్రెన్యూరర్‌, దుబాయ్‌లో ఇన్నోగ్లోబుల్‌ డిఎంసిసి డైరెక్టర్‌గా ఉన్న ప్రసాద్‌ గారపాటిని ఆఫ్రికాలో ఉన్న ఘన దేశంలోని ఛాంబర్‌ ఆఫ్‌ టూరిజం ఇండస్ట్రీవారు టూరిజం అంబాసిడర్‌గా, యుఎఈ రిప్రజెంటెటివ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 22 నుంచి ఈ నియామకపు ఉత్తర్వులు అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఘన దేశానికి సంబంధించిన పెట్టుబడులు టూరిజం ప్రమోషన్‌, ఇతర వ్యవహారాల్లో ఆయన యుఎఈ, ఘన దేశం మధ్య వారధిగా పనిచేయనున్నారు. భారత్‌లోనూ, అమెరికాలోనూ, దుబాయ్‌లోనూ వివిధ వర్గాలవారితో ప్రసాద్‌ గారపాటికి సత్సంబంధాల ఉన్నాయి. అలాగే ఆయన ఇండియాలో ఇన్నోకార్ప్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, చైర్మన్‌గా, కాస్టెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు.

గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ తరపున ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. వివిధ రంగాల్లో అనుభవం ఉన్న ప్రసాద్‌ గారపాటి తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని, తనవంతుగా ఘనదేశంలో పెట్టుబడులు, టూరిజం, ఇతర రంగాల అభివృద్ధికి వివిధ రంగలవారితో కలిసి కృషి చేస్తానని చెప్పారు.

 

Tags :