పీకే కీలక ప్రకటన.. అక్టోబరు 2 నుంచి

పీకే కీలక ప్రకటన..  అక్టోబరు 2 నుంచి

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీకే సొంతంగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరుందుకున్నాయి. తాజాగా దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ ఏమీ పెట్టలేదని వెల్లడించారు. బిహార్‌ పురోగతి కోసం 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి  పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తన పాదయాత్రలో వీలైనంత మందిని కలవనున్నట్లు ఆయన చెప్పారు. బీహార్‌లో  ఇప్పుడేమీ ఎన్నికలు లేవని, ఇక ఇప్పట్లో రాజకీయ పార్టీని స్థాపించే ప్రణాళిక ఏదీ లేదన్నారు. రాబోయే మూడు లేదా నాలుగేళ్లు ప్రజలకు చేరువయ్యే పనిలో నిమగ్నం కానున్నట్లు ఆయన తెలిపారు.

 

Tags :