కాంగ్రెస్ కు షాక్.. పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం

కాంగ్రెస్ కు షాక్.. పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం

గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ప్రతాప్‌ సింహ రాణే కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పోరియం నియోజకవర్గం నుంచి పోటీకి ఎంపిక చేసింది. అయితే తాజాగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే భారతీయ జనతా పార్టీ పోరియం నియోజక వర్గం నుంచి ప్రతాప్‌ రాణే కోడలు దేవీయ విశ్వజిత్‌ రాణేను బరిలో దింపింది. అయితే దీనిపై ప్రతాస్‌ సింహ రాణే స్పందించారు. ప్రస్తుతం వయసు రీత్యా శారీరక సమస్యల వలనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. ప్రతాస్‌ సింహ రాణే పోరియం నియోజక వర్గం నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపోందారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం గోవా రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.

 

Tags :