ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా 'ప్రత్యర్థి' ట్రైలర్‌

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా 'ప్రత్యర్థి' ట్రైలర్‌

తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. రొటీన్ మాస్ మసాలా చిత్రాలను అంతగా ఇష్టపడటం లేదు. కొత్త కథలను, ఎగ్జైటింగ్ అనిపించే కథనంతో వచ్చే చిత్రాలను ఆదరిస్తున్నారు. అలాంటి కొత్త సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి అంటూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానెలు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ ప్రత్యర్థి సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ ముడావత్ దర్శకత్వ వహించగా.. గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సంజయ్ సాహ నిర్మించారు.జనవరి 6న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.

ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. నగరంలో జరిగిన మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఎస్ఐ చనిపోయవడం, ఆ కేసును పరిష్కరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగడం వంటివి చూపించడం వల్ల మొదట్లోనే కట్టిపడేసినట్టు అయింది ట్రైలర్. ఇక ఈ ట్రైలర్‌ను చూసి కథను మాత్రం కచ్చితంగా అంచనా వేయలేం. ఇలాంటి చిత్రంలో మనం ఊహించిన దాన్ని మించి ట్విస్టులుంటాయి. ఇక ఈ ప్రత్యర్థిలోనూ అలాంటి ట్విస్టులే ఉండేట్టు కనిపిస్తున్నాయి.ఈ ట్రైలర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌లో ఆర్ఆర్ అదిరిపోయింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ మూడ్‌ను మెయింటైన్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ పాల్ ప్రవీణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రాకేష్‌ గౌడ్ కెమెరాపనితనం బాగుంది.

 

 

Tags :