భారత సంతతి మహిళ రికార్డు

అమెరికాలోని న్యూయార్క్ పోలీసు శాఖ (ఎన్‌వైపీడీ)లో భారత సంతతి మహిళ ప్రతిమా భుల్లార్ మల్డోనాడో రికార్డు సృష్టించారు. ఆ శాఖలో అత్యున్నత ర్యాంకు పొందిన దక్షిణాసియా వనితగా గుర్తింపు పొందారు. గత నెలలో కెప్టెన్‌గా పదోన్నతి పొందిన ఆమె, క్వీన్స్‌లోని దక్షిణ రిచ్‌మండ్ హిల్‌లోని 102వ పోలీస్ ప్రాంగణ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమా భుల్లార్ పంజాబ్‌లో జన్మించగా, తన తొమ్మిదో ఏటనే న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు చేరుకున్నారు. దేశంలోని అతిపెద్ద సిక్కు కమ్యూనిటీల్లో దక్షిణ రిచ్ మండ్ హిల్ ప్రాంతం కూడా ఒకటి. తన బాల్యం అంతా ఇక్కడే గడిచిందని, 25 ఏళ్లకు పైగా పెరిగిన ప్రాంతంలోనే బాధ్యతలు నిర్వర్తించడం పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు ప్రతిమ. ఈ ప్రాంతంలో భాషాపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాటిని అధిగమించడానికి నా వంతు కృషి చేస్తా. మా నాన్న ట్యాక్సీ డ్రైవరుగా కష్టపడి పనిచేస్తూ చదివించారు. నేను పోలీసు ఉద్యోగానికి ఎంపిక కాకముందే 2006లో ఆయన మరణించారు. ఒకవేళ మా నాన్న బతికిఉంటే నా ఉన్నత స్థితిని చూసి గర్వపడేవారు అని ప్రతిమా భుల్లార్ పేర్కొన్నారు.