అభినందన్ వర్ధమాన్ కు వీర్ చక్ర ప్రదానం

అభినందన్ వర్ధమాన్ కు వీర్ చక్ర ప్రదానం

పాకిస్థాన్‌తో గగనతల పోరాటంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌  (అప్పట్లో వింగ్‌ కమాండర్‌) అభినందన్‌ వర్ధమాన్‌ వీర్‌ చక్ర పురస్కారాన్ని స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అభినందన్‌కు ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

ఫిబ్రవరి 26, 2019న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాక్‌ దాడులకు యత్నించగా భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 27, 2019న శత్రు దేశానికి చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన అభినందన్‌, అనంతరం తాను నడుపుతున్న మిగ్‌-21 బైసన్‌ దాడికి గురై పాక్‌ భూభాగంలో కూలడంతో ఆ దేశంలో మూడు రోజులపాటు బందీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

Tags :