బైడెన్ కు ఏ పాపం తెలియదు : వైట్ హౌస్ వెల్లడి

బైడెన్ కు  ఏ పాపం తెలియదు : వైట్ హౌస్ వెల్లడి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసం సహా ప్రైవేటు కార్యాలయంలో వెలుగు చూసిన రహస్య పత్రాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఈ రహస్య పత్రాల నిగ్గు తేల్చేందుకు మేరీల్యాండ్‌ జిల్లా మాజీ అటార్నీ రాబర్ట్‌ హర్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు యూఎస్‌ అటార్నీ జనరల్‌ మెర్రిక్‌ గార్లాండ్‌ ప్రకటించారు. అత్యంత సునిశిత విషయాల్లో జవాబు దారీ తనం పెంపొందించే ఉద్దేశంతోనే విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.  ఎలాంటి భయం లేకుండా వాస్తవాల ఆధారంగా వేగవంతంమైన విచరణ చేసి, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని వ్యాఖ్యానించారు.  ఇదిలా ఉంటే, రహస్య పత్రాలపై విచారణను స్వాగతిస్తున్నట్టు అధ్యక్షుడు బైడెన్‌ తరుపు ప్రత్యేక కౌన్సిల్‌ రిచర్డ్‌ సాబెర్‌ తెలిఆరు. వైట్‌ హౌస్‌ నుంచి సహకారం ఉంటుందన్నారు. 

 

 

Tags :