శ్వేత జాతి ఆధిపత్య విషయం శాపంలా వెంటాడుతోంది

శ్వేత జాతి ఆధిపత్య విషయం అమెరికాను శాపంలా వెంటాడుతున్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. బఫెలోలో ఇటీవల ఓ శ్వేత జాతి దురహంకారి సాగించిన నరమేధంలో మృతులకు నివాళులర్పించేందుకు, బాధిత కుటుంబాలతో మాట్లాడేందుకు టాప్స్ సూపర్ మార్కెట్లో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. శ్వేత జాతి ఆదిపత్యవాద గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ ని చెత్తబుట్టలోకి విసిరేయాలని బైడెన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పదకొండు మంది నల్లజాతీయులను అత్యంత దారుణమైన రీతిలో కాల్చి చంపిన యువకుడిని ఈ జాత్యహంకారమే ప్రేరేపించిందని ఆయన అన్నారు.
అమెరికాలో శ్వేత జాతీయుల మెజారిటీని వలసదారులు, ఇతర వర్ణాలకు చెందిన వారితో భర్తీ చేసేందుకు యూదులు, డెమొక్రాట్లు ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని రిపబ్లికన్లు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు రాజకీయ అధికారం పొందడం కోసం జాత్యహంకారాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.