28న హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక

దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఏటా డిసెంబర్ మాసం చివర్లో హైదరాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్న ఆమె మూడు రోజులపాటు హైదరాబాద్లో బస చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మూడు రోజుల పాటు బస చేసే రాష్ట్రపతి ఇక్కడి నుంచే దక్షిణాది ర్ఱాష్టాల్లో పలు అధికారిక కార్యక్రమాలకు పాల్గొనేందుకు వెళ్తారు. ఈ నెల 28 హైదరాబాద్ వచ్చి 30న ఢిల్లీకి తిరిగి వెళతారని సమాచారం. రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దుండిగల్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం వెళ్లడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లు చేయనుండగా, అక్టోపస్, ఇంకా ఇతర కేంద్ర బలగాలు పర్యవేక్షణ, భద్రత చర్యల్లో పాల్గొంటాయి.
Tags :