అమెరికా చరిత్రలోనే తొలిసారిగా...

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా...

అమెరికాలో చరిత్రలోనే తొలిసారిగా ఓ నేటివ్‌ అమెరికన్‌ మహిళ ఆ దేశ ట్రెజరర్‌గా నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌ లిన్‌ మాలెర్బాను ట్రెజరర్‌గా నియమించారు. అమెరికా ట్రెజరీ విభాగంలో గిరిజన, నేటివ్‌ వ్యవహరాల కార్యాలయం ఏర్పాటు చేసిన క్రమంలో మలెర్బా నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రెజరర్‌ విధుల్లో టంకశాల పర్యవేక్షణ, ఫెడరల్‌ రిజర్వ్‌త్‌తో సమన్వయం, ట్రెజరీ కార్యాలయ వినియోగదారుల విధానం పర్యవేక్షణ వంటివి ఉంటాయి. దీంతో పాటు  అమెరికా నగదు నోట్లపై ట్రెజరర్‌ సంతకం ఉంటుంది. మొహీగన్‌ ఇండియన్‌ తెగ జీవితకాల అధ్యక్షురాలైన మలెర్బా గతంలో రిజిస్టర్డ్‌ నర్సుగా, వివిధ గిరి జన ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు.

 

Tags :