ఈ చట్టం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది

ఈ చట్టం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది

తుపాకుల వాడకంపై నియంత్రణ కోసం అమెరికా సర్కారు చట్టం చేసింది. బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. ఈ చట్టం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది అన్నారు. అయితే తాను కోరుకొంటున్న అన్ని అంశాలు ఈ చట్టంలో లేవని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం సరిపోతుందని వ్యాఖ్యానించారు. యువకులు, నేరపూరిత స్వభావం ఉన్నవారికి తుపాకులు తేలిగ్గా లభించకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది. ప్రమాదకరమైన వ్యక్తులుగా భావిస్తున్న వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. తుపాకుల అక్రమ రవాణాను నిరోధిస్తుంది. ఈ బిల్లు ప్రతినిధుల సభలో 234`193 ఓట్ల తేడాతో పాసైంది. ఈ బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడం చరిత్రాత్మకం అన్నారు.

 

Tags :