జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌

భారత 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్‌పథ్‌ పరేడ్‌ చూసేందుకు అనుమతించారు. 15 ఏళ్లలోపు వారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.

 

Tags :