ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు అరుదైన అవకాశం

ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు అరుదైన అవకాశం

ఈ నెల 24న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ స్వయంగా బాపూరావుకు ఫోన్‌ చేసి వెంటనే ఢిల్లీ కి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై ఆదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించింది.

 

Tags :