శ్రీనివాస మనాప్రగడకి ప్రెసిడెంట్స్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌

శ్రీనివాస మనాప్రగడకి ప్రెసిడెంట్స్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌

భారతీయ అమెరికన్‌ శ్రీనివాస మనాప్రగడకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆ రాష్ట్ర గుర్తింపు పొందిన కల్చరల్‌ అంబాసిడర్‌గా, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ కల్చరల్‌ ఎఫైర్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా కమ్యూనిటీ సర్వీస్‌, వాలంటీర్‌ లీడర్‌షిప్‌ విభాగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకు గానూ అమెరికా ప్రభుత్వం ఆయనను ప్రెసిడెంట్స్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ 2022తో సత్కరించింది. నెవాడాలోని లాస్‌ వెగాస్‌లోని కాస్మోపాలిటన్‌ ఆఫ్‌ లాస్‌ వెగాస్‌ హోటల్‌లో జరిగిన ఒక గ్రాండ్‌ ఈవెంట్‌ కార్యక్రమంలో గౌరవనీయులైన కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా చేతుల మీదుగా శ్రీనివాస మనాప్రగడ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస మనాప్రగడ మాట్లాడుతూ.. అత్యంత గౌరవప్రదమైన ఈ అవార్డును అందుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డును అందుకునే ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడిగా దేశ అభ్యున్నతి కోసం ముందుండి నడిపిస్తున్నందుకు తనకు లభించిన గౌరవంగా దీనిని భావిస్తున్నానన్నారు. తనను ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన తన తల్లిదండ్రులు నాన్న జానపద బ్రహ్మ శ్రీ మానాప్రగడ నరసింహ మూర్తి, అమ్మ రేణుకాదేవి మానాప్రగడ అలాగే కుటుంబంలోని వారి ప్రోత్సాహం వల్ల తనకు ఈ అవార్డు లభించిందన్నారు. అలాగే డా. పైళ్ల మల్లా రెడ్డి, డా. విజయపాల్‌ రెడ్డి, డాక్టర్‌ హరనాథ్‌, డాక్టర్‌ మోహన్‌ పట్లోల్ల, సిఎ గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌, అసెంబ్లీ సభ్యులు యాష్‌ కల్రా, కాంగ్రెస్‌ సభ్యులు మైక్‌ హోండా, కాంగ్రెస్‌ సభ్యుడు ఎరిక్‌ స్వాల్వెల్‌,  ఆనంద్‌ కూచిబొట్ల,  జయరాం కోమటి, డా. రోమేష్‌ జాప్రా, రమేశ్‌ తంగెళ్లపల్లి, భరత్‌ మాదాడి, వెంకట్‌ ఏక్క, అనిల్‌ అరబెల్లి, వంశీరెడ్డి, సరస్వతి, నందశ్రీరామ, ప్రసాద్‌, రవినేతి, సోహైల్‌, అమిత్‌ తదితరులు తనను ప్రోత్సహించారని చెప్పారు.

 

 

 

Tags :