పిల్లల కోసం అప్పుడే రూ.1500 కోట్లతో ఇల్లు

ప్రియాంక చోప్రా, నిక్ జంట పుట్టబోయే పిల్లల కోసం ముందుగానే భారీ ప్లాన్ చేశారని తెలుస్తోంది. లాజ్ ఏంజిల్స్ లో సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయటం, దాన్ని తమ అభిరుచికి తగ్గటుగా మూడు నెలలపాటు రినోవేషన్ కూడా చేయించారని తెలుస్తోంది. పిల్లలు పుట్టి వారు పెద్దయ్యే దాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు అందులో ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సరోగసి ద్వారా ఇప్పటికే తల్లిదండ్రులు అయిన ఈ జంట మున్ముందు మరో బిడ్డకు కూడా జన్మనిచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
Tags :