భారత్ జోడో యాత్ర.. జాయిన్ అయిన ప్రియాంక గాంధీ

భారత్ జోడో యాత్ర.. జాయిన్ అయిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌ లో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్‌ సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. రాహుల్‌ తన పాదయాత్రను మధ్యప్రదేశ్‌లోని బోర్గామ్‌ గ్రామం నుంచి  ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రెహాల్‌లతో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు.  పాదయాత్రలో పాల్గొన్న ప్రియాంక తన సోదరుడు రాహుల్‌తో నవ్వుతూ కనపించారు.  ఇద్దరు చాలా ఉత్సాహంగాఅడుగులు వేస్తూ ముందుకు సాగారు. ప్రియాంక గాంధీ రాహుల్‌  చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి.  భారత్‌ జోడో యాత్ర లో పాల్గొన్న ప్రియాంక గాంధీ యాత్రల్లో పాల్గొన్నవారికి, యాత్ర మార్గంలో పెద్ద ఎత్తున ఉన్న  ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

 

Tags :