కాంగ్రెస్ కీలక ప్రకటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన

కాంగ్రెస్ కీలక ప్రకటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటన కూడా ఈ తరహాలోనిదే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 125 మందితో కూడిన తొలి విడత జాబితాను పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విడుదల చేశారు. ఇందులో ఉన్నావ్‌ అత్యాచార బాధితురాల్లి తల్లి ఆశా సింగ్‌ కూడా ఉన్నారు. ప్రియాంక ప్రకటించిన 125 మంది అభ్యర్థుల్లో 50 మంది (40 శాతం) మహిళా అభ్యర్థులు, మరో 40 శాతం మంది యువత ఉన్నారు. వీరిలో ఆశా కార్యకర్త పూనమ్‌ పాండే, సామాజిక కార్యకర్త సదాఫ్‌ జాఫర్‌ కూడా ఉన్నారు.  2017లో ఉన్నావ్‌కు చెందిన టీనేజీ బాలికపై కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసిన సంగతి తెలిసిందే.

 

Tags :