సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?

సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆమె నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడిరచారు. పార్టీ గెలుపు కోసం ఆమె శ్రమిస్తున్నారు. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే దీనిపై ఇంకా స్పష్టత లేదు అని తెలిపారు. తాము ఏ పార్టీతో కూటమి ఏర్పాటు చేయబోవట్లేదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు అప్పుడే రాజకీయ వేడి మొదలవడంతో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకోనుంది.

 

Tags :