చెత్త సినిమాకు.. అమెరికాలో అవార్డు

అమెరికా అధ్యక్ష (2020) ఎన్నికల్లో మోసం జరిగిందన్న ఆరోపణల కథాంశంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా తెరకెక్కించిన సినిమా అబ్జల్యూట్ ప్రూఫ్ (సంపూర్ణ రుజువు) అతి చెత్త మూవీగా 2021 రజ్జీ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు ఇంకా ఈ జాబితాలో గాయని సియా దర్శకత్వం వహించిన మ్యూజిక్, రూడీ గిలానీ-ఫార్మర్ న్యూయార్క్ సిటీ మేయర్లు కూడా ఉన్నాయి. గోల్డెన్ రాస్బెర్రీ అవార్డులను పాపులర్‌గా రజ్జీ అవార్డులుగా పేర్కొంటుంటారు. వీటిని సంప్రదాయంగా అస్కార్కస్ నైట్‌కు ఒక రోజు ముందున ప్రకటిచారు. అబ్జల్యూట్ ప్రూఫ్‌కు మై పిల్లో సిఇఒ మైక్ లిండెల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో స్వయంగా నటించిన లిండెల్కు చెత్త నటన అవార్డు వచ్చింది. ఇకపోతే మ్యూజిక్ సినిమాకు చెత్త డైరెక్టర్‌తో పాటు మరో రెండు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 2020లో విడుదలైన అతి చెత్త సినిమాల జాబితాలో అబ్జల్యూట్ ప్రూఫ్‌కు ఈ అవార్డు వచ్చిందని ఎంటర్టైన్మెంట్ వీక్లి తాజాగా వెల్లడించింది.