గేమ్ చేంజర్‌కు దిల్ రాజు సేఫ్ ప్లాన్

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఈ సినిమా చేస్తున్నాడు. చరణ్ కెరీర్లో గేమ్ చేంజర్ 15వ సినిమాగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుందనుకుని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలానే ఉంది.
శంకర్ దర్శకత్వంలో వస్తున్న కమల్‌హాసన్ ఇండియన్2 సినిమాను సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నట్లు చెన్నై మీడియా వర్గాలు చెప్తున్నాయి. దాని తెలుగు డబ్బింగ్ నైజామ్ రైట్స్ దిల్ రాజే కొన్నాడట. దాన్ని మైండ్ లో పెట్టుకునే ఇండియన్2 షూట్ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు మూడు నెలల్లో దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశాడట శంకర్.
దీంతో పాటూ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మహేష్28 సినిమా రైట్స్ కూడా దిల్ రాజే కొనుగోలు చేశాడట. అంటే ఎటు చూసినా సరే గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు. అసలే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. మధ్యలో ఇంకో పెద్ద సినిమాను తీసుకొచ్చి దిల్ రాజు గేమ్ చేంజర్ ను రిస్క్ లో పెట్టలేడు.
అందుకే ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా పుష్ప2, దేవర రిలీజ్ డేట్లను చూసుకుని వాటికి పోటీ లేకుండా ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడట. అంటే గేమ్ చేంజర్ ఎంత త్వరగా షూటింగ్ పూర్తైనప్పటికీ చరణ్ ఫ్యాన్స్ ఇంకో ఏడాది పైన ఎదురుచూడక తప్పదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.