నీవు నా మనసు దోచుకున్నావ్..! : నిర్మాత ఎస్‌కేఎన్ స్పీచ్ కి ఫిదా అయినా మెగాస్టార్

నీవు నా మనసు దోచుకున్నావ్..! : నిర్మాత ఎస్‌కేఎన్ స్పీచ్ కి ఫిదా అయినా మెగాస్టార్

పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జూన్ 26న హైద్రాబాద్‌లో జరిగింది. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ అద్భుతంగా మాట్లాడేశాడు. గోపీచంద్ రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ జూలై 1న రాబోతోంది. ఈ మేరకు సినిమా ప్రమోషన్‌లను పెంచేశారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. బండ్ల గణేష్ లేని లోటుని తీర్చాడు. చివరకు సుమ కూడా బండ్ల గణేష్ స్పీచులా ఉందంటూ పరోక్షంగా కౌంటర్లు వేసింది. చిరంజీవి మీదున్న ప్రేమ, భక్తిని ఇలా చూపించేశాడు ఎస్‌కేఎన్. ఆయన పోలికలు, ఉపమానాలు, పొగడ్తలు, ప్రాసలు చూసి ఏకంగా చిరంజీవే ప్రసన్నుడయ్యాడు.

ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘భారతదేశానికి సరిహద్దులు..తూర్పున హిమాలయాలు.. పశ్చిమాన బంగాళాఖాతమంటారు. తెలుగు చిత్ర సీమలో ఎవరైనా ఆపదలో ఉన్నారంటే.. అన్ని దిక్కులా చిరంజీవి గారు కనిపిస్తారు.. 2002 ఇంద్ర రిలీజ్ ముందు.. ఏలూరు సత్యనారాయణ థియేటర్ ముందు చిరంజీవి బ్యానర్‌లు కట్టేవాడిని అలాంటిది.. గీతా ఆర్ట్స్ మెగా బ్యానర్‌లో ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ స్థాయి వరకు ఎదిగానంటే.. మనకు ఇండస్ట్రీలో ఎవ్వరూ లేకపోయినా.. చిరంజీవి గారిని  ఇన్‌స్పిరేషన్ చేసుకుంటే.. ఏమీ లేనోడు కూడా ఓ స్థాయికి ఎదగలను అని ఇన్‌స్పిరేషన్. నేను ఈ రోజు ఇక్కడ ఆయన కళ్లలోకి చూడలేకపోతోన్నాను.. ఎందుకంటే బాస్ కళ్లలోకి చూడలేం కాబట్టి.. ఒకే ఒక్కడు.. అందరివాడు.. చాలా మందికి అందని వాడు.. మెగాస్టార్ ఒక్కడే.. స్థాయికి, స్థానానికి ఇంట్లో ఉండొచ్చు.. ఇండస్ట్రీకి అవసరం వచ్చినా, వ్యక్తులకు అవసరం వచ్చినా, వ్యవస్థలకు అవసరం వచ్చినా, ఎవరికైనా అవస్థ వచ్చినా మనం వ్యక్తులను మరిచిపోతాం.. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మరిచిపోలేం.. ఇండియాకు ఎవరెస్ట్ ఉంది.. టాలీవుడ్‌కి ఉన్న ఎవరెస్ట్ మెగాస్టార్ మాత్రమే. సార్ మీరు ఈ రోజు ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది.. మీకు చాలా అపాయింట్మెంట్లు ఉన్నాయ్.. అయినా కూడా మాకోసం వచ్చారు.. సంతోషంగా ఉంది.. గోపీచంద్ అని ఆయనకు నామకరణం చేశారు గానీ.. గోల్డ్ చంద్ అని పెట్టాలి.. చూడటానికి హ్యండ్సమ్‌గా ఉంటారు.. నటిస్తే ఆసమ్‌గా ఉంటుంది..

రాశీ ఖన్నా పుట్టింది గల్లీలో.. ఇళ్లు కొన్నది మాత్రం మణికొండ గల్లీలో.. చాలా మంది హిందీ హీరోయిన్లు వస్తారు.. మన డబ్బులు పట్టుకెళ్తారు.. కానీ ఆమె మాత్రం మన దగ్గరే ఇళ్లు కొనుక్కుంది.. ఈ బ్యానర్‌లో నా మిత్రుడు మారుతి వరుసగా చిత్రాలు చేయడం సంతోషంగా ఉంది.. సినిమాలో ఉండాల్సిన గ్లామర్, గ్రామర్ తెలుసు.. జూలై 1న తగ్గించిన రేట్ల మీద అందుబాటులోకి రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినట్టుగా.. ఏసినిమాకు అయినా టికెట్ తెంచేది మెగా ఫ్యాన్స్. అందరూ ఈ సినిమాకు సపోర్ట్‌గా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.  ఇలా ఎస్‌కేఎన్ మాట్లాడిన మాటలకు చిరంజీవి ఫిదా అయ్యాడు. చిరు తన స్పీచు అంతా ముగించుకున్న తరువాత.. ఎస్‌కేఎన్ గురించి చెప్పాడు. చాలా బాగా మాట్లాడావ్.. నా మనసు దోచుకున్నావ్.. నా మనసులోకి వెళ్లావ్ అని మెచ్చుకున్నాడు. దీంతో ఎస్‌కేఎన్ చిరు కాళ్ల మీద పడి నమస్కరించాడు.

 

Tags :