MKOne Telugu Times Business Excellence Awards

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊహించని ఘటన

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊహించని ఘటన

అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌కు సంఫీుభావంగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఒక మహిళ  తెలిపిన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. దక్షిణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫెస్టివల్‌లో ఫ్రెంచ్‌ చలనచిత్ర దర్శకుడు జస్ట్‌ ఫిలిప్పోట్‌ చిత్రం యాసిడ్‌ ప్రీమియర్‌కు ముందు ఓ మహిళ ఉక్రెయిన్‌ జెండా రంగులున్న దుస్తులు ధరించి రెండ్‌ కార్పొట్‌పైకి నడుచుకుంటూ వెళ్లి, ఓ చోట నిబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం తన వెంట తెచ్చిన బాటిల్‌ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుని నిరసన తెలపడం మొదలు పెట్టింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించే వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. గత సంవత్సర కాలంగా రష్యా ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడులు కారణంగా అక్కడ నెత్తుటి దారులు ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంకేతంగా ఆ మహిళ నకిలీ రక్తంతో ఈ రకంగా తన నిరసన ప్రదర్శించినట్లు తెలుస్తోంది.  అయితే  సదరు మహిల వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఉక్రెయిన్‌ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు. 

 

 

Tags :