పరుగుల రాణికి కీలక పదవి

పరుగుల రాణికి కీలక పదవి

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ప్రముఖ అథ్లెట్‌ పీటీ ఉష ఎన్నికయ్యారు. ఈ పదవి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తోటి అథ్లెట్స్‌, జాతీయ సమాఖ్యల మధ్దతులో ఐఓఏ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న తొలి మహిళ ఉషానే. మహరాజా యాదవీంద్ర సింగ్‌ (1934, ,క్రికెట్‌) తర్వాత ఈ  బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆమెనే భారత అథ్లెటిక్స్‌లో చరిత్రలో ఎన్నో మరుపురాని విజయాలతో తన పేరును సువర్ణాక్షరాలతో  లిఖించనున్న 58 ఏళ్ల ఉష క్రీడా పాలకురాలిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి.

 

Tags :