పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో ఈ కేసును వేగంగా విచారించనుంది. యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‌ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
Tags :