అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

ఒడిశాలోని పూరిలో జగన్నాథ యాత్రలో భాగంగా పహండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రథాలను సర్వాంగ సుందరంగా అలకరించారు. జగన్నాథుడు, బలబద్రుడు, సుభద్రా రథాలు యాత్ర కోసం సిద్ధమయ్యాయి. పహండిలో భాగంగా బలభద్రుడు చెక్క విగ్రహాన్ని తలద్వాజ రథం వద్దకు తీసుకెళ్లారు. బలభద్రుడి తర్వాత దేవి సుభద్ర విగ్రహాన్ని దేబదలన రథం వద్దకు తీసుకువచ్చారు. పూరి శ్రీమందిరం నుంచి భగవాన్‌ జగన్నాథుడి విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా అలకరించిన నందిఘోష రథం వద్దకు తీసుకువచ్చారు. రెండేళ్ల తర్వాత రథయాత్ర కోసం భక్తులను అనుమతి ఇచ్చారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల గడిచిన రెండేళ్లు భక్తులను అనుమతించని విషయం తెలిసిందే.

 

Tags :