పర్యావరణవేత్త పూర్ణిమకు.. అత్యున్నత పురస్కారం

పర్యావరణవేత్త పూర్ణిమకు.. అత్యున్నత పురస్కారం

అస్సాంకు చెందిన పూర్ణిమా దేవి బర్మన్‌కు 2022 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ వరించింది. అంతరించిపోతున్న హర్గిలా అనే పక్షి జాతిని కాపాడేందుకు ఈమె హర్గిలా ఆర్మీ పేరుతో మహిళా గ్రూపును తయారీ చేశారు. అటవీ జీవశాస్త్రవేత్త అయిన బర్మన్‌రెండు దశాబ్ధాలుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం ( యూఎన్‌ఈసీ) తెలిపింది. గ్రీన్‌ ఆస్కార్‌గా పిలుచుకునే ఈ అవార్డును బర్మన్‌, యూకేకు చెందిన సర్‌పార్థా దాస్‌గుప్తా, పెరూ, లెబనాన్‌, కామెరూన్‌ దేశాల ఉద్యమకారులకు ఐరాస ప్రకటించింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.