పుష్ప2 రిలీజ్ విషయంలో డైలమా

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నానా అవస్థలు పడుతున్నారు. పుష్ప1 రిలీజైంది డిసెంబర్ 2021లో. టాలీవుడ్‌కు అది డ్రై మంత్ కావడంతో తెలుగు వెర్షన్‌కు భారీ స్థాయిలో రికార్డులు రాబట్టలేకపోయింది.
నార్త్ లో ఈ సినిమా బాగా ఆడటం వల్ల పుష్ప1 సేఫ్ అయింది కానీ లేకపోతే కథ వేరేలా ఉండేది. దానికి తోడు సినిమా వెంటనే ఓటీటీలోకి రావడం వల్ల సంక్రాంతి టైమ్ వరకు లేకుండా పోయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పుష్ప1 కి జరిగిన తప్పు పుష్ప2 విషయంలో జరగకూడదని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప2 ఈ ఇయర్ ఎండింగ్‌కి రిలీజ్ చేస్తే రిస్క్ ఇంకాస్త ఎక్కువుంటుంది. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే చాలా సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. కాబట్టి సంక్రాంతి టైమ్ కు పుష్ప2 థియేటర్ల నుంచి తీసేయాల్సిన పరిస్థితి. ఈ సినిమా బడ్జెట్‌కి కనీసం నెల, రెండు నెలలు ఆడే స్టామినా ఉన్నప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడమనే యాంగిల్‌లో మేకర్స్ ఆలోచిస్తున్నారట.
పోనీ సమ్మర్ లో రిలీజ్ చేద్దామంటే ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5కి రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. గేమ్ చేంజర్ కూడా సమ్మర్‌నే. అధికారికంగా డేట్ రావడం ఒకటే పెండింగ్. కాబట్టి ఏ సినిమాతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. అంతేకాదు టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ రిలీజ్ లు కూడా చూసుకుని పుష్ప2 రిలీజ్ ను ప్లాన్ చేసుకోవాలి. అలా అయితేనే పుష్ప2 బడ్జెట్‌కు సరిపోయే కలెక్షన్లను రాబట్టగలదు. ఇన్ని సమస్యల మధ్య పుష్ప2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.