నలుగురు టాప్ స్టార్స్ సమక్షం లో పుష్ప ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నలుగురు టాప్ స్టార్స్ సమక్షం లో పుష్ప ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్- రష్మిక మందన హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'ను డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట సుకుమార్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్కెచ్చేశారంటే ఇక తిరిగే ఉండదనేది సినీ వర్గాల మాట. ఎలాంటి కథనైనా నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయగల సమర్థుడు సుకుమార్. ఆయన క్రియేటివిటీ నుంచి రాబోతున్న మరో విభిన్న కథాంశం 'పుష్ప'. అల్లు అర్జున్- రష్మిక మందన హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట సుక్కు. డిసెంబర్ 17వ తేదీకి సరిగ్గా 5 రోజుల ముందు అంటే డిసెంబర్ 12న ఈ గ్రాండ్ ఈవెంట్‌ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఇక ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా పలువురు టాప్ స్టార్స్‌ని గెస్టులుగా ఆహ్వానిస్తున్నారట సుకుమార్. పక్కాగా స్కెచ్చేసి రంగంలోకి దూకుతున్న ఆయన, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ మునుపెన్నడూ చూడనంత గ్రాండ్‌గా జరగాలని భావిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇకపోతే ఈ పుష్ప మూవీలో అల్లు అర్జున్ మాస్ రోల్ చేస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఆయన కనిపించనుండగా.. పల్లెటూరు అమ్మాయిగా రష్మిక మందన ఆడిపాడనుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బలమైన కథను 'పుష్ప' పేరుతో రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొత్తం 5 భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం. ఇక ఈ మూవీలో సమంత చేస్తున్న స్పెషల్ సాంగ్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది.

 

Tags :