అమెరికా రహస్యాలు లీక్ చేసిన వ్యక్తికి.. రష్యా పౌరసత్వం

అమెరికా రహస్యాలు లీక్ చేసిన వ్యక్తికి.. రష్యా పౌరసత్వం

అమెరికా నిఘా వర్గాలకు చెందిన రహస్య పత్రాలను లీక్‌ చేసిన వ్యక్తికి రష్యా పౌరసత్వం లభించింది. అమెరికాలో సెక్యూరిటీ కాంట్రాక్టర్‌గా పనిచేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఈ పత్రాలను బహిర్గత పరిచి ప్రజావేగుగా మారారు. ఆయనకు రష్యా పౌరసత్వం ఇస్తూ జారీ యిన డిక్రీపై అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. అమెరికాలో కోర్టు విచారణను తప్పించుకోవడానికి 2013లో రష్యా వచ్చిన స్నోడెన్‌ అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. 2020లో శాశ్వత నివాసం లభించింది. తాజాగా పౌరసత్వం లభించింది. ఆయనతో పాటు మొత్తం 75 మంది విదేశీయులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ పుతిన్‌ నిర్ణయం తీసుకున్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.