ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం .. తమ దేశంలో కూడా

ప్రధాని మోదీకి  పుతిన్ ఆహ్వానం .. తమ దేశంలో కూడా

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ అక్కడను ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యాక వారిద్దరూ నేరుగా సమావేశమవడం ఇదే తొలిసారి. భారత్‌లో గత ఏడాది డిసెంబరులో తాను పర్యటించినప్పటి జ్ఞాపకాలను మోదీతో భేటీలో పుతిన్‌ గుర్తు చేసుకున్నారు. రష్యాలో పర్యటించాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. శనివారం మోదీ పుట్టినరోజు అని తనకు తెలుసని పుతిన్‌ చెప్పారు. నా ప్రియ స్నేహితుడా సెప్టెంబరు 17 నీ జన్మదినమని, నాకు తెలుసు. రష్యన్‌ సంప్రదాయం ప్రకారం మేం ఎప్పుడూ ముందస్తు శుభాకాంక్షలు తెలపం, కాబట్టి ఇప్పుడే నీకు జన్యదిన శుభాకాంక్షలు చెప్పలేను. అయితే మాకు మితద్రేశమైన భారత్‌ నీ నేతృత్వంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నా అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

Tags :