రష్యాలో మార్పు...అమెరికాకు ఇబ్బందా?

రష్యాలో మార్పు...అమెరికాకు ఇబ్బందా?

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా ఇప్పుడు చర్చలకు సిద్ధమని చెబుతోంది. దీనిపై పలువురికి ఆశ్చర్యం కలిగినా రష్యా దీంతోపాటు చెప్పిన ఓ మాట మాత్రం అమెరికాకు ఇబ్బందేనని చెబుతున్నారు.  తాము చర్చలకు సిద్ధం అంటూ అనుహ్యంగా  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందుకు వచ్చారు. అదీగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాక అనుహ్యంగా పుతిన్‌ చర్చలకు తెరతీయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఇరు దేశాలవైపు భారీ మొత్తంలో సైనికులు నేలకొరిగి, జరగాల్సిన తీవ్ర నష్టం చవిచూశాక రష్యా అధ్యక్షుడు ఇలా అనడంలో ఆంతర్యం తెలియదు గానీ అందర్నీ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే పుతిన్‌ చర్చలకు సిద్ధం అంటూనే మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. ఉక్రెయిన్‌లో రష్యా తన సొంతమని చెప్పుకుంటున్న భూభాగాలను అమెరికా గుర్తించాలి అని ఒక షరతు పెట్టాడు. అమెరికా అందుకు అంగీకరిస్తానే తాను యుద్ధ ప్రాతికన చర్చలకు సిద్ధం అని పుతిన్‌ స్పష్టం చేశారు. 

 

Tags :