ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదు ...

ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదు ...

ఉక్రెయిన్‌ విషయంలో తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చి చెప్పారు. తుర్క్‌మెనిస్తాన్‌లో పుతిన్‌ పర్యటించారు. డోన్బాస్‌ విముక్తి కోసం, అక్కడి ప్రజల రక్షణ కోసం పోరాడుతున్నామని తెలిపారు. రష్యా భద్రతకు హామీనిచ్చే పరిస్థితులను సృష్టించుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందంటూ వస్తున్న విమర్శలను పుతిన్‌ ఖండించారు. ప్రణాళిక ప్రకారమే తమ సైన్యం పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గాబాట్‌లో కాస్సియన్‌ సీలిటోరల్‌ స్టేట్స్‌ శిఖరాగ్ర దస్సులో పుతిన్‌ పాల్గొన్నారు.

 

Tags :