అమెరికా టెక్నాలజీ కంపెనీ క్వింటెల్లి ..హైదరాబాద్ లో 500 మందికి పైగా

అమెరికా టెక్నాలజీ కంపెనీ క్వింటెల్లి ..హైదరాబాద్ లో 500 మందికి పైగా

అమెరికా టెక్నాలజీ కంపెనీ క్వింటెల్లి, తన హైదరాబాద్‍ కేంద్రాన్ని విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఈ సంవత్సరాంతంలోగా 500 మందికి పైగా టెక్‍ నిపుణుల ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డెవలపర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, ఆటోమేషన్‍ ఇంజీనీర్లు, ఇతర విభాగాల నిపుణులను తీసుకోన్నట్లు క్వింటెల్లి వెల్లడించింది. డిజిటల్‍ ట్రాన్స్మిషన్‍, ప్యూచర్‍ రెడీ అప్లికేషన్లకు సంబంధించి కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ విస్తరణను ప్రతిపాదించినట్లు పేర్కొంది. 2023 నాటికి 100 కోట్ల డాలర్ల సంస్థాగత విలువ సాధించాలనే లక్ష్యాన్ని క్వింటెల్లి నిర్ణయించింది. కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యాసం (మెషీన్‍ లెర్నింగ్‍), డీప్‍ లెర్నింగ్‍ విభాగాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు క్వింటెల్లి ఎగ్జిక్యూటివ్‍ వైఎస్‍ ప్రెసిడెంట్‍ రాషి శ్రీవాస్తవ పేర్కొన్నారు.

 

Tags :