దమ్ముంటే నాపై పోటీ చేసి... కొడాలి నానికి రావి వెంకటేశ్వరరావు సవాల్

దమ్ముంటే నాపై పోటీ చేసి... కొడాలి నానికి  రావి వెంకటేశ్వరరావు సవాల్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కొడాలి నానిపై పోటీకి తమ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ దాకా ఎందుకు దుమ్ముంటే నాపై గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. బాబు, లోకేష్‌ లపై నాని చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. ఇటీవల  కిడ్నీ ఆపరేషన్‌ తో పాటు బ్రెయిన్‌ సర్జరీ కూడా కొడాలి నానికి జరిగినట్లు ఉందని సెటైర్లు వేశారు. తొందరపడి ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు ప్రజలు తమ కర్మ అని భావిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఛాన్స్‌ అంటూ ఎన్నికలోలో పోటీ చేసిన జగన్‌ కి ఇదే చివరి చాన్స్‌ అని అన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.