విజయసాయిరెడ్డి లాంటి వారు ఆ పదవులకు తగరు: రఘురామకృష్ణరాజు

విజయసాయిరెడ్డి లాంటి వారు ఆ పదవులకు తగరు: రఘురామకృష్ణరాజు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రముఖులను ధూషిస్తున్నారని, అసభ్య పదజాలం వినియోగిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లపై విజయసాయిరెడ్డి అత్యంత దారుణంగా పోస్ట్‌లు చేస్తున్నారని, వాటిలో దారుణ పదజాలం వాడుతున్నారని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఇలాంటివి మరెన్నో పోస్ట్‌లు కనిపిస్తాయని, ఇందులో ఆశ్చర్యపరిచే విషయాలు, విశేషాలు బహిర్గతం అవుతాయని రఘురామ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. విపక్ష నేతలపై సామాజిక మాధ్యమాల వేదికగా ఇలాంటి దిగజారుడు భాష వినియోస్తున్న విజయసాయి వంటి వారు ఉన్నత పదవులకు తగరని రఘురామరాజు స్పష్టం చేశారు. కాబట్టి సాయిరెడ్డిని ప్యానెల్ స్పీకర్ పదవి నుంచి తక్షణం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని, దాంతో పాటు స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎథిక్స్ కమిటీ పదవుల నుంచి కూడా తప్పించాలని రఘురామ తన ఫిర్యాదు లేఖలో రాజ్యసభ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.