ఏపీ రాజధాని అంటే ఏం చెప్పాలి... ఎక్కడని చెప్పాలి? : రఘురామ

ఏపీ రాజధాని అంటే ఏం చెప్పాలి... ఎక్కడని చెప్పాలి? : రఘురామ

మరో పది రోజుల్లో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం అమరావతి రైతులు మహాపాదయాత్ర కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్డీఏలో రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌, హైకోర్టు ఉంటాయని గతంలో అగ్రిమెంట్‌ చేశారు.. మూడు రాజధానుల అంశంలో వెనక్కి వెళ్లేదిలేదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు, రాజధానికి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికైనా సీమ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రికి ఎందుకింత కక్ష. రాజధాని అంటే ఏం చెప్పాలి, ఎక్కడని చెప్పాలి. రాయలసీమ రాజకీయాలు మానేసి అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టండి. రాష్ట్రంలో 95 శాతం మున్సిపాలిటీలు గెలిచాం. ఒక్క కొండపల్లి మున్సిపాలిటీ పోతే ఏమవుతుంది. రాజధాని ఆపే శక్తి ఒక్క కోర్టుకు మాత్రమే ఉంది. న్యాయస్థానం న్యాయం చేయాలి అని అన్నారు.

 

Tags :