ఓటర్ల లాగే ఉద్యోగ సంఘాలు ఉంటే ఎలా ? : రఘురామ

ఓటర్ల లాగే ఉద్యోగ సంఘాలు ఉంటే ఎలా ? : రఘురామ

హెచ్‌ఆర్‌ఏ తగ్గించిన ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శఠగోపం పెట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల లాగానే ఉద్యోగ సంఘాలు ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పై పోరులో ప్రజలకు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌, మెగాస్టార్‌ చిరంజీవి భేటీ తర్వాతైనా పరిశ్రమపై దాడి ఆగిపోవాలని ఆకాంక్షించారు.  కొందరి స్వార్థ రాజకీయాల వల్లే సంక్రాంతి జరుపుకోలేకపోతున్నానని తెలిపారు. సీఐడీ ఆరోపణలపై ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మే 14 లోపు రాష్ట్రంలో రాక్షసపాలన అంతానికి అంకురార్పణ జరుగుతుందన్నారు.

 

Tags :