నాకు భద్రత కావాలి.. ఎందుకంటే

నాకు భద్రత కావాలి.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యనంద రాయ్‌, కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిశారు. తన నియోజకవర్గానికి జులై 4న ప్రధానమంత్రి మోదీ రాక సందర్భంగా తాను వెళ్లాల్సి ఉంటుందని ఆయన హోం శాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తనకు కావాల్సిన భద్రతను కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విశాఖపట్నంలో కమిటీ మీటింగ్‌కు వెళ్లానుకుంటే రనివ్వలేదన్నారు. ప్రధానమంత్రి సభ తన నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్‌ ముందే ఊహించలేదని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితులు శాంతిభద్రతల అంశంలో ఇలాగే ఉంటే లా అండ్‌ ఆర్డర్‌ అంశం ఉమ్మడి జాబితాలో చేర్చాల్సి ఉంటుందన్నారు.

 

Tags :