నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ... ఈడీని సమయం కోరిన రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ... ఈడీని సమయం కోరిన రాహుల్

నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండిరగ్‌ కేసులో ఈడీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని విచారిస్తున్నది.  ఈ నెల 17న విచారణకు కావాలని సూచించింది. అయితే ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఈడీకి రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. ఇందులో తన తల్లి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కొవిడ్‌ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రాస్తావించారు. రేపు కూడా తాను హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరముందని అన్నారు. అయితే దీనిపై ఈడీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.  ఈ కేసులో వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ఈడీ విచారించిన విషయం తెలిందే.  మొత్తం 30 గంటల పాటు దర్యాప్తు అధికారులు ఆయనను ప్రశ్నించారు.  ఇదిలా ఉండగా రాహుల్‌పై ఈడీ విచారణకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేస్తున్నది.

 

Tags :