అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నానన్న రాహుల్ గాంధీ

దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఆయన బిజీగా ఉన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ పలు అసక్తికర అంశాలను పంచుకున్నారు. తన వివాహంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా సమాధానాలు చెప్పారు. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని 52 ఏళ్లు రాహుల్ గాంధీ వెల్లడిరచారు. మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని అడగగా సరైన అమ్మా దొరికితే కచ్చితంగా చేసుకుంటానని రాహుల్ సమాధానం ఇచ్చారు. చెక్ లిస్ట్ ఏమైనా ఉందా అని ప్రశ్నించగా అదేమీ లేదు. ప్రేమించే వ్యక్తి, ఇంటలిజెంట్ అయితే చాలు అని తన అభిప్రాయాన్ని రాహుల్ బయటపెట్టారు. తన తల్లి సోనియా గాంధీ, తన నాన్నమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి లక్షణాలు తనకు కాబోయే భాగస్వామిలో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.