తెలంగాణలో రాహుల్ గాంధీకి.. మరో షాక్

తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో షాక్ తగిలింది. చంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్కు అనమతి లభించలేదు. చంచల్గూడ జైలు సూపరిండెంట్ ఈ మేరకు రాహుల్ గాంధీ ఎన్ఎస్ఐయూ నేతలతో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ మీటింగ్కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్గూడ జైలుకు తరరలించారు. వీళ్లతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్ గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. అయినా అధికారులు అంగీకరించలేదు.
Tags :