భర్తపై పీడీయాక్ట్ రద్దు చేయాలని గవర్నర్ తమిళిసైను కోరిన రాజాసింగ్‌ భార్య

భర్తపై పీడీయాక్ట్ రద్దు చేయాలని గవర్నర్ తమిళిసైను కోరిన రాజాసింగ్‌ భార్య

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఉన్న పీడీయాక్ట్‌ను రద్దు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైను రాజాసింగ్ భార్య ఉషాబాయి కోరారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ సతీమణి ఉషాభాయి ఆదివారం నాడు గవర్నర్ తమిళిసైను కలిశారు. సందర్భంగా తన భర్తపై పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని, ప్రజల్లో ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఇలా వ్యవహరిస్తోందని ఉషాభాయి తన లేఖలో ఆరోపించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం పీడీయాక్ట్ కింద చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ అక్రమంగా బనాయించిన కేసులని, ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ఉషాభాయి గవర్నర్‌ను కోరారు. రాజాసింగ్‌పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని కొన్నిరోజులుగా ఆరోపిస్తున్న ఉషాబాయి..తనకు న్యాయం చేయాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు గవర్నర్‌ను ఇలా అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లు తన భర్తపై వంద కేసులు లేవని, అవన్నీ ప్రజాకోర్టులో కొట్టేసినవే అని వివరించారు. 

 

Tags :