రాజస్థాన్ మహిళకు అరుదైన అవకాశం...ఒక్క రోజు దౌత్యవేత్తగా

రాజస్థాన్ మహిళకు అరుదైన అవకాశం...ఒక్క రోజు దౌత్యవేత్తగా

రాజస్థాన్‌కు చెందిన అదితి మహేశ్వరి భారత్‌లో బ్రిటన్‌ దౌత్యవేత్తగా ఒక్కరోజు పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ నెల 8న భారత్‌లో బ్రిటన్‌ హై కమిషనర్‌గా పని చేశారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2017 నుంచి భారత్‌, బ్రిటన్‌ సంయుక్తంగా ఈ పోటీని నిర్వహిస్తున్నాయి. డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల మహేశ్వరి ప్రభుత్వం నిర్వహించిన హై కమిషనర్‌ ఫర్‌ ద డే పోటీలో ఇటీవల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ చేరాలని ఆశిస్తున్న మహేశ్వరి బ్రిటన్‌ దౌత్యవేత్తగా ఒకరోజు పనిచేసే అవకాశం దక్కించుకున్నారని బ్రిటిష్‌ హైకమిషనర్‌ వెల్లడిరచింది. ఈ మేరకు బాధ్యతలు నిర్వర్తించిన ఆమె అనేక రకాల దౌత్య కార్యకలాపాలు నిర్వర్తించారని తెలిపింది.

 

Tags :