తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా రాజీవ్ సాగర్

తెలంగాణ ఫుడ్స్  చైర్మన్‌గా రాజీవ్ సాగర్

తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్‌ చైర్మన్‌గా మేడే రాజీవ్‌ సాగర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తగా ఉన్న మేడే రాజీవ్‌ సాగర్‌ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2006 నుంచి తెలంగాణ జాగృతిలో కోశాధికారిగా ఉన్న ఆయన అనంతర కాలంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా ఆరేండ్ల పాటు కొనసాగారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

మలి దశ తెలంగాణ ఉద్యమంలో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉద్యమ సాంస్కృతిక చిహ్నమైన తెలంగాణ జాగృతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా నియమించింది.

 

Tags :