ప్రధాని మోదీ వ్యాయామ శిక్షకుడిగా.. మంచిర్యాల వాసి

ప్రధాని మోదీ వ్యాయామ శిక్షకుడిగా.. మంచిర్యాల వాసి

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేస్తుండగా ఆయనకు ప్రత్యేక వ్యాయమ శిక్షకుడిగా మంచిర్యాల పట్టణానికి చెందిన గడప రాజేష్‌ నియమితులయ్యారు. ఈ నెల 2 నుంచి 4 వరకు ట్రెడ్‌మిల్‌, జిమ్‌  సైకిల్‌ సాధనకు శిక్షకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో అథ్లెటిక్స్‌ కోచ్‌ (సాట్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు.  మూడు రోజుల పాటు దేశ ప్రధాని వ్యాయామ సాధనలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని రాజేష్‌ తెలిపారు.

 

Tags :