రాజకీయాలపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్... మరోసారి క్లారిటీ

రాజకీయాలపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్... మరోసారి క్లారిటీ

రాజకీయ అరంగ్రేటంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో చెన్నై రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌తో జరిగిన చర్చల్లో రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. అయితే తాను రాజకీయాల్లోకి రాబోనని తేల్చి చెప్పేశారు. తమిళనాడులో కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పొలిటిక్‌ ఎంట్రీ ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. నిజానికి కొన్నేళ్లుగా సూపర్‌ స్టార్‌ రజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు కూడా. అయితే తాను రాజకీయాలకు రాబోనని సూపర్‌ స్టార్‌ మరోమారు స్పష్టం చేశారు.

 

Tags :